‘ఎక్స్‌’ నూతన వినియోగదార్లు పోస్ట్‌, లైక్‌కు రుసుము చెల్లించాలి

ఎక్స్‌ (గతంలో ట్విటర్‌) ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా నమోదయ్యే వినియోగదార్లు ఇకపై లైక్‌, పోస్ట్‌, బుక్‌మార్క్‌, రిప్లయ్‌ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ తెలిపింది.

Published : 17 Apr 2024 01:41 IST

నకిలీ ఖాతాల నియంత్రణకే

దిల్లీ: ఎక్స్‌ (గతంలో ట్విటర్‌) ఫ్లాట్‌ఫామ్‌పై కొత్తగా నమోదయ్యే వినియోగదార్లు ఇకపై లైక్‌, పోస్ట్‌, బుక్‌మార్క్‌, రిప్లయ్‌ కోసం తక్కువ మొత్తంలో వార్షిక రుసుము చెల్లించాల్సి రావొచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఖాతాలను అనుసరించడం (ఫాలో), ఎక్స్‌లో పోస్ట్‌లు చూసే ప్రక్రియలకు ఛార్జీలు ఉండవని, ఆ సేవలు ఉచితమని తెలిపింది. బోట్స్‌, నకిలీ ఖాతాల నియంత్రణకు ఇదొక్కటే మార్గమని వెల్లడించింది. దీని వల్ల స్పామ్‌ తగ్గి, ప్రతి వినియోగదారు అత్యుత్తమ అనుభూతి పొందే వీలుంటుందని తెలిపింది. కొత్త వినియోగదార్లు 3 నెలల తర్వాత ఎక్స్‌పై అన్ని సదుపాయాలను ఉచితంగా వాడొచ్చని ఎక్స్‌ కార్ప్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. కొత్త నిబంధనలు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనా లేదంటే ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. ధ్రువీకరణ కాని కొత్త వినియోగదార్లకు.. తమ ఖాతాపై ‘కొంత రుసుము చెల్లించి పోస్ట్‌ చేసే సదుపాయాన్ని అన్‌లాక్‌ చేసుకోవాలని’ ఒక డైలాగ్‌ బాక్స్‌ కనిపిస్తోంది. ప్రీమియం చందాదార్లకు మాత్రం పోస్ట్‌కు సంబంధించి అన్ని సదుపాయాలతో పాటు ఇతర ప్రీమియం ఫీచర్లు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు