2024లో వృద్ధి రేటు 6.8%

ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పెంచింది.

Published : 17 Apr 2024 01:52 IST

అంచనా పెంచిన ఐఎంఎఫ్‌

దిల్లీ: ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పెంచింది. ఈ ఏడాది జనవరి అంచనాల్లో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని సంస్థ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా గిరాకీ పరిస్థితులు సానుకూలంగా ఉండటం, పనిచేసే వయసున్న జనాభా సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని, వృద్ధిరేటు అంచనాలను పెంచుతున్నట్లు ఐఎంఎఫ్‌ తెలిపింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ ఈ ఏడాదీ కొనసాగుతోందని, ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ తాజా నివేదికలో ఐఎంఎఫ్‌ పేర్కొంది. చైనా వృద్ధిరేటు 2023కు అంచనా అయిన 5.2 శాతం నుంచి 2024లో 4.6 శాతానికి, 2025లో 4.1 శాతానికి నెమ్మదించొచ్చని తెలిపింది. ప్రపంచ వృద్ధి 2023లో 3.2 శాతంగా అంచనా వేస్తుండగా.. 2024, 2025 సంవత్సరాల్లోనూ అదే స్థాయిలో కొనసాగొచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని