శామ్‌సంగ్‌ కృత్రిమ మేధ టీవీలు

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీలను శామ్‌సంగ్‌ బుధవారం విపణిలోకి విడుదల చేసింది.

Published : 18 Apr 2024 02:16 IST

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీలను శామ్‌సంగ్‌ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. క్యూఎల్‌ఈడీ ప్రారంభ ధర రూ.1.39 లక్షలు, ఓఎల్‌ఈడీ ప్రారంభ ధర రూ.1.64 లక్షలుగా నిర్ణయించారు. ఏఐ పిక్చర్‌, ఏఐ సౌండ్‌ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

రూ.10,000 కోట్ల టీవీ విక్రయాల లక్ష్యం: ఈ ఏడాది దేశీయంగా రూ.10,000 కోట్ల విలువైన టీవీలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (విజువల్‌ డిస్‌ప్లే వ్యాపారం) మోహన్‌దీప్‌ సింగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీవీలకు గిరాకీ పెరగడానికి తోడు ప్రీమియం ఉత్పత్తులు ఇందుకు దోహదపడతాయన్నారు. దేశీయ టీవీ విపణిలో తమకు 21% వాటా ఉందని, 2024లో ఇది స్థిరీకరించుకుంటుందని తెలిపారు. ప్రీమియం టీవీలపై అధికంగా దృష్టి సారించామని, మొత్తం టీవీ విక్రయాల్లో వీటి వాటా 40 శాతంగా ఉందని పేర్కొన్నారు. 55 అంగుళాల టీవీలు, అల్ట్రా హై డెఫినిషన్‌ (యూహెచ్‌డీ) మోడళ్లకు గిరాకీ మరింతగా పెరిగే అవకాశం ఉందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని