డాక్టర్‌ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు

అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది.

Published : 18 Apr 2024 02:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. ఏఎస్‌ఐ ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలో’ గుర్తింపు కూడా ఇచ్చింది. మనదేశంలో అస్ట్రోనాటిక్స్‌ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్‌ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. ఏఎస్‌ఐకి అధ్యక్షుడిగా ఉన్న ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌, ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ చేతుల మీదగా ‘ఆర్యభట్ట’ అవార్డును డాక్టర్‌ పావులూరి సుబ్బారావు అందుకున్నారు. ఆయనకు గతంలో ‘భాస్కర’ అవార్డు లభించింది. ఈ రెండు అవార్డులను దక్కించుకున్న అరుదైన శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు సాధించారు. డాక్టర్‌ సుబ్బారావు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1992లో అనంత్‌ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రోతో పాటు మనదేశ రక్షణ అవసరాలకు అనువైన అత్యాధునిక ఏవియానిక్స్‌ పరిశోధన- అభివృద్ధిలో ఈ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థకు హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురంలలో పరిశోధన- అభివృద్ధి, తయారీ కేంద్రాలున్నాయి. ఇస్రో చేపట్టిన 98 ఉపగ్రహాలు, 78 రాకెట్‌ ప్రయోగాల్లో అనంత్‌ టెక్నాలజీస్‌ భాగస్వామిగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు