దిల్లీ-దుబాయ్‌ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం

మే 1 నుంచి దిల్లీ-దుబాయ్‌ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది.

Published : 19 Apr 2024 01:08 IST

దిల్లీ: మే 1 నుంచి దిల్లీ-దుబాయ్‌ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. ఏఐ995/996 సర్వీసు దిల్లీలో రోజూ రాత్రి 8:45 గంటలకు ప్రారంభమై, రాత్రి 10:45 గంటలకు దుబాయ్‌ చేరుతుందని ఎయిరిండియా గురువారం ప్రకటించింది. తిరుగు ప్రయాణంలో, అర్ధరాత్రి 12:15 గంటలకు బయలుదేరి, దిల్లీకి తెల్లవారుజామున 4:55 గంటలకు చేరుకుంటుంది. ఎ350 విమానాల్లో ఫుల్‌-ఫ్లాట్ బెడ్లతో 28 ప్రైవేటు సూట్లు, ప్రీమియం ఎకానమీలో 24 సీట్లు, ఎకానమీ క్లాస్‌లో 264 సీట్లు ఉంటాయి. ఎయిరిండియా మొత్తం 40 ఎ350 విమానాలకు ఆర్డరు పెట్టగా 4 విమానాలు సంస్థ చేతికి అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని