బజాజ్‌ ఆటో 800% డివిడెండు

బజాజ్‌ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Updated : 19 Apr 2024 01:14 IST

దిల్లీ: బజాజ్‌ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,433 కోట్లతో పోలిస్తే ఇది 35% అధికం. కార్యకలాపాల ఆదాయం సైతం రూ.8,905 కోట్ల నుంచి 29% పెరిగి రూ.11,485 కోట్లకు చేరుకుంది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) కంపెనీ నికర లాభం రూ.7,479 కోట్లకు చేరుకుంది. 2022-23లో ఈ మొత్తం రూ.5,628 కోట్లే. ఇదే సమయంలో ఆదాయమూ రూ.26,428 కోట్ల నుంచి రూ.44,685 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.80 (800%) డివిడెండుకు బోర్డు ఆమోదం తెలిపింది.

మార్కెట్‌ ముగిసిన అనంతరం ఫలితాలు వెలువడ్డాయి. అప్పటికే బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.61% పెరిగి రూ.9,062 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని