నిప్టీ నెక్ట్స్‌ 50 సూచీకి డెరివేటివ్‌ కాంట్రాక్టులు

నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీకి డెరివేటివ్‌ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తెలిపింది.

Published : 19 Apr 2024 01:19 IST

ఈనెల 24న ప్రారంభించనున్న ఎన్‌ఎస్‌ఈ

దిల్లీ: నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీకి డెరివేటివ్‌ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తెలిపింది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగతా కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీలో ఉంటాయి. ‘నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీకి డెరివేటివ్‌ కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సెబీ నుంచి అనుమతులు లభించాయి. 2024 ఏప్రిల్‌ 24 నుంచి ఈ సూచీకి కాంట్రాక్టులు ప్రారంభించనున్నామ’ని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. 3 వరుస నెలల ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతారు. ప్రతి నెలా చివరి శుక్రవారం, ఆ నెలకు సంబంధించిన కాంట్రాక్టు గడువు తీరుతుంది.

  •  1997 జనవరి 1న నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీని ఎన్‌ఎస్‌ఈ తీసుకొచ్చింది.
  • 2024 మార్చి చివరికి ఈ సూచీలో ఆర్థిక సేవల రంగానికి అత్యధికంగా 23.76% వాటా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో భారీ యంత్ర పరికరాలు (11.91%), వినియోగదారు సేవలు (11.57%) ఉన్నాయి.
  • 2024 మార్చి 29 నాటికి  నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.70 లక్షల కోట్లు. ఎన్‌ఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువలో ఇది సుమారు 18%.  
  • ఈ సూచీలోని కంపెనీల రోజువారీ సగటు ట్రేడింగ్‌ టర్నోవరు రూ.9,560 కోట్లు. 2023-24లో నమోదైన మొత్తం క్యాష్‌ మార్కెట్‌ టర్నోవరులో ఈ విలువ సుమారు 12%.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని