ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ

దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్‌ కార్ప్‌ నివేదిక వెల్లడించింది.

Published : 19 Apr 2024 01:21 IST

క్వెస్‌ కార్ప్‌ నివేదిక

ముంబయి: దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్‌ కార్ప్‌ నివేదిక వెల్లడించింది. 2023 మార్చితో పోలిస్తే గత నెలలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో నియామకాలు 154% పెరిగాయని, నైపుణ్య వృద్ధి ఇందుకు ఉపకరించిందని తెలిపింది. టెలికాం రంగంలో నియామకాలకు గిరాకీ (64%) బాగా ఉండటంతో మొత్తం ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు పెరిగాయని పేర్కొంది. లైటింగ్‌, వాహన రంగాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో నియామకాలు జరిగాయి. ఈ నియామకాల్లో ప్రాంతాల వారీగా చూస్తే 33% వాటాతో తమిళనాడు అగ్ర స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ ఉన్నాయి. పరిశ్రమ నిపుణుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించినట్లు క్వెస్‌ కార్ప్‌ తెలిపింది.

  •  ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో ముఖ్యంగా తయారీలో వివిధ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు పెరిగాయి. మొబైల్‌ తయారీ రంగంలో వీరికి గిరాకీ బాగా ఉంది. తర్వాత స్థానాల్లో రిటైల్‌, సేవల రంగాలు ఉన్నాయి.
  • 2025-26 నాటికి 10 లక్షల ఉద్యోగాలు ఈ రంగంలో లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి ఎలక్ట్రానిక్స్‌ విపణి పరిమాణం 400 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.33.20 లక్షల కోట్ల)కు పెరుగుతుందని ఆశిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని