అమరరాజా ఇన్‌ఫ్రాకు గ్రీన్‌కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు

గ్రీన్‌కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్‌ పీక్‌) సోలార్‌ బీఓఎస్‌ (బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్‌) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది.

Published : 20 Apr 2024 03:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రీన్‌కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్‌ పీక్‌) సోలార్‌ బీఓఎస్‌ (బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్‌) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ వద్ద 2,200 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద సౌర విద్యుత్తు ప్రాజెక్టును గ్రీన్‌కో గ్రూపు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి  700 ఎండబ్ల్యూపీ సోలార్‌ బీఓఎస్‌ (బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్‌) కాంట్రాక్టు అమరరాజా గ్రూపు సంస్థ, అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌ఐపీఎల్‌)కు లభించింది. దీంతో తమ చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ రూ.1,516 కోట్లకు పెరిగినట్లు అమరరాజా ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఈ కాంట్రాక్టులో భాగంగా ఇంజినీరింగ్‌, సేకరణ, నిర్మాణ పనులను అమరాజా ఇన్‌ఫ్రా నిర్వహిస్తుంది. నిరంతరం శ్రమించి పునరుత్పాదక ఇంధన విభాగంలో తాము విస్తరిస్తున్నట్లు, గ్రీన్‌కో కాంట్రాక్టు దక్కడం దీనికి నిదర్శనమని ఏఆర్‌ఐపీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని