జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లాభం రూ.311 కోట్లు

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 20 Apr 2024 03:47 IST

దిల్లీ: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.294 కోట్లతో పోలిస్తే, ఇది 6% అధికం. ఇదే సమయంలో ఆదాయం స్వల్పంగా రూ.414 కోట్ల నుంచి రూ.418 కోట్లకు పెరిగింది. వ్యయాలు కూడా రూ.99 కోట్ల నుంచి రూ.103 కోట్లకు పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.31 కోట్ల నుంచి పలు రెట్లు పెరిగి రూ.1,605 కోట్లకు చేరింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకింగ్‌ వ్యాపారాల కోసం బ్లాక్‌రాక్‌తో కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఈ వారం ప్రారంభంలో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని