మహీంద్రా యూనివర్సిటీతో రాక్‌వెల్‌ ఆటోమేషన్‌ భాగస్వామ్యం

పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్‌వెల్‌ ఆటోమేషన్‌తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Published : 20 Apr 2024 03:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్‌వెల్‌ ఆటోమేషన్‌తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ‘క్లైమేట్‌ సొల్యూషన్స్‌’ కోర్సును రూపొందించి, అమలు చేసేందుకు రెండు సంస్థలూ పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. ఈ సందర్భంగా రాక్‌వెల్‌ ఆటోమేషన్‌ ఇండియా ఎండీ దిలీప్‌ సాహ్నీ మాట్లాడుతూ.. మా నైపుణ్యం, వనరులతో పర్యావరణ రంగంలో నిపుణులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మహీంద్రా యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ సస్టైనబిలిటీ విభాగాధిపతి అనిర్బన్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం అధునాతన సాంకేతికతతో, వాతావరణ పరిష్కారాల ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని