26 శాతం పెరిగిన ఎల్‌ఐసీ ప్రీమియం వసూళ్లు

ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి.

Published : 20 Apr 2024 03:48 IST

దిల్లీ: ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. 2023 మార్చిలో వసూలైన రూ.28,716.23 కోట్లతో పోలిస్తే ఇది 26.41% ఎక్కువ. ఎల్‌ఐసీ తర్వాత ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రీమియం వసూళ్ల వృద్ధి 24.76 శాతంగా ఉంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 12.58% వృద్ధి నమోదుచేసింది. మరోదిగ్గజ బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ  ప్రీమియం వసూళ్లలో 20.05% క్షీణత చవిచూసింది. 2024 మార్చికి ప్రీమియం వసూళ్ల పరంగా ఎల్‌ఐసీకి 58.87% మార్కెట్‌ వాటా ఉంది. పన్ను మినహాయింపుల కోసం వినియోగదారులు బీమా పాలసీలు తీసుకోవడంతో, మార్చిలో బ్రీమా సంస్థల ప్రీమియం వసూళ్లలో వృద్ధి నమోదైందని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ తెలిపింది. గత నెలలో ఎల్‌ఐసీ గ్రూప్‌ వార్షిక రెన్యూవబుల్‌ ప్రీమియం 200.62%, గ్రూప్‌ ప్రీమియం 47.17% దూసుకెళ్లాయి. 2023-24లో గ్రూప్‌ వార్షిక రెన్యూవబుల్‌ ప్రీమియం 140.51% వృద్ధితో రూ.843.99 కోట్ల నుంచి రూ.2,029.88 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని