ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి

‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 03:49 IST

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: ‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3-5 తేదీల్లో జరిగిన పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశ వివరాలను ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం..

ధరలపై భౌగోళిక-రాజకీయ పరిణామాల ప్రభావం పడొచ్చని దాస్‌తో పాటు ఎమ్‌పీసీలోని ఇతర సభ్యులూ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరి నుంచీ రెపో రేటును 6.5 శాతం వద్దే ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. అధిక వడ్డీ రేట్ల వల్ల వృద్ధిని త్యాగం చేయాల్సి వస్తుందని.. రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించాలని ఎమ్‌పీసీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ అభిప్రాయపడ్డారు. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు బలంగా కనిపిస్తున్నాయని దాస్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం సైతం 2024-25లో 4.5 శాతానికి పరిమితం కాగలదని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతం, 2022-23లో 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ‘ధరల స్థిరత్వంపైనే దృష్టి సారించడానికి బలమైన వృద్ధి మాకు సహకరిస్తోంది. ధరల స్థిరత్వమే మా లక్ష్యం. అదే అధిక వృద్ధికి గట్టి పునాదులు వేస్తుంద’ని దాస్‌ పేర్కొన్నారు. కాగా, తదుపరి ఎమ్‌పీసీ సమావేశం జూన్‌ 5-7న జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని