తగ్గిన రత్నాభరణాల ఎగుమతులు

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రత్నాభరణాల ఎగుమతులు 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లకు (32,022.8 మిలియన్‌ డాలర్లు) పరిమితమయ్యాయని రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) వెల్లడించింది.

Published : 21 Apr 2024 02:18 IST

2023-24లో రూ.2.65 లక్షల కోట్లు: జీజేఈపీసీ

ముంబయి: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రత్నాభరణాల ఎగుమతులు 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లకు (32,022.8 మిలియన్‌ డాలర్లు) పరిమితమయ్యాయని రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) వెల్లడించింది. అమెరికాలో అధిక వడ్డీరేట్లు, చైనా రికవరీలో స్తబ్దత కారణంగా రత్నాభరణాల ఎగుమతులు తగ్గాయని జీజేఈపీసీ తెలిపింది. 2022-23లో వీటి ఎగుమతులు రూ.3,01,925.97 కోట్లుగా (37,646.17 మి.డాలర్లు) నమోదయ్యాయి. ‘భారత్‌కు రత్నాభరణాల ఎగుమతుల్లో కీలకమైన అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం ప్రభావం చూపింది. అలాగే కొవిడ్‌-19 తర్వాత చైనాలో రికవరీ బాగా నెమ్మదించడం కూడా ఎగుమతులు తగ్గేందుకు కారణమైంద’ని జీజేఈపీసీ ఛైర్మన్‌ విపుల్‌ షా వెల్లడించారు.

  •  కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాల ఎగుమతులు రూ.1,76,716.06 కోట్ల (22,046.9 మి.డాలర్లు) నుంచి 25.23% తగ్గి రూ.1,32,128.29 కోట్లకు (15,966.47 మి.డాలర్లు) పరిమితమయ్యాయి. ల్యాబ్‌లో తయారైన పాలిష్డ్‌ వజ్రాల స్థూల ఎగుమతులు రూ.13,468.32 కోట్ల (1,680.22 మి.డాలర్లు) నుంచి 13.79 శాతం తగ్గి రూ.11,611.25 కోట్లకు (1,402.3 మి.డాలర్లు) పరిమితమయ్యాయి.
  •  పసిడి ఆభరణాల ఎగుమతులు రూ.76,589.94 కోట్ల (9,538.84 మి.డాలర్లు) నుంచి 20.57% పెరిగి రూ.92,346.19 కోట్లకు (11,140.78 మి.డాలర్లు) చేరాయి. వెండి ఆభరణాల ఎగుమతులు రూ.23,556.71 కోట్ల (2,939.9 మి.డాలర్లు) నుంచి 43% తగ్గి రూ.13,406.1 కోట్లకు (1,616.42 మి.డాలర్లు) పరిమితమయ్యాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని