నాట్కో ఫార్మా తెలంగాణ ప్లాంట్‌లో లోపాలు

తెలంగాణలోని కొత్తూర్‌లో ఉన్న నాట్కో ఫార్మా ప్లాంట్‌లో లోపాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తించింది.

Published : 22 Apr 2024 02:06 IST

దిల్లీ: తెలంగాణలోని కొత్తూర్‌లో ఉన్న నాట్కో ఫార్మా ప్లాంట్‌లో లోపాలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తించింది. శుభ్రత పాటించడంలో, పరికరాలు- పాత్రలను నిబంధనల మేరకు స్టెరిలైజ్‌ చేయడంలో కంపెనీ విఫలమైందని, నాట్కో ఫార్మాకు పంపిన హెచ్చరిక లేఖలో యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. కంపెనీలో 2023 అక్టోబరు 9-18 తేదీల మధ్య నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలను గుర్తించినట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ తెలిపింది.  ఔషధ బ్యాచ్‌లో లోపాలను వెంటనే చక్కదిద్దడంలోనూ కంపెనీ విఫలమైందని ఆరోపించింది. మొత్తం ఉల్లంఘనలు, లోపాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా నాట్కో ఫార్మాను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని