అల్ట్రాటెక్‌ సిమెంట్‌ చేతికి ఇండియా సిమెంట్స్‌ గ్రైండింగ్‌ యూనిట్‌

ఇండియా సిమెంట్స్‌కు చెందిన 1.1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యమున్న గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.315 కోట్లతో కొనుగోలు చేసినట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది.

Published : 22 Apr 2024 02:07 IST

దిల్లీ: ఇండియా సిమెంట్స్‌కు చెందిన 1.1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యమున్న గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.315 కోట్లతో కొనుగోలు చేసినట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. ఇందుకోసం ఆస్తుల కొనుగోలు ఒప్పందం (ఏపీఏ) చేసుకున్నట్లు తెలిపింది. వేగంగా వృద్ధి చెందుతున్న మహారాష్ట్ర విపణిలో మరింత బలోపేతం అయ్యేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని పేర్కొంది. విక్రయ మొత్తం రూ.315 కోట్లలో రూ.307 కోట్లు త్వరలోనే తమకు అందుతాయని, మిగతా రూ.8 కోట్లు ఒప్పందం తేదీ నుంచి 9 నెలల్లోపు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ చెల్లిస్తుందని ఇండియా సిమెంట్స్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. విక్రయించిన యూనిట్‌ నికర ఆస్తుల విలువ రూ.75.10 కోట్లుగా ఉంది.

మహారాష్ట్రలోనే రెండు యూనిట్లలో సామర్థ్య విస్తరణ కోసం మరో రూ.504 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అల్ట్రాటెక్‌ తెలిపింది.పార్లిలో 1.2 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న ప్లాంటు విస్తరణ కోసం రూ.166.4 కోట్లు, 1.8 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్న  ధూలే యూనిట్‌లో రూ.338 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అంతర్గత నిల్వల నుంచి నిధులు కేటాయిస్తామని, ఈ పనులు 2025-26లో పూర్తవుతాయని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని