సహజవాయువు డీలా!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,681 వద్ద నిరోధం ఎదురుకావచ్చు.

Published : 22 Apr 2024 02:09 IST

కమొడిటీస్‌
ఈ వారం


పసిడి

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,681 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,555; రూ.75,795 వరకు రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.71,565 కంటే దిగువన ట్రేడయితే రూ.70,325, రూ.69,451 వరకు పడిపోవచ్చు. రూ.71,565 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.


వెండి

వెండి మే కాంట్రాక్టు రూ.84,318 కంటే ఎగువకు వెళ్తే రూ.85,113 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.82,732 కంటే కిందకు వస్తే రూ.81,941 వరకు దిగిరావచ్చు. ఇప్పటికే మోతాదుకు మించి కొనుగోళ్ల మద్దతు లభించినందున.. అధిక స్థాయిల వద్ద కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మేలు.


ప్రాథమిక లోహాలు

  • రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టుకు రూ.828.25 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.810.95 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.854.35 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.863.45 వరకు పెరగొచ్చని భావించవచ్చు.
  • సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టుకు రూ.187.85 వద్ద మద్దతు లభించొచ్చు. ఇంతకంటే దిగితే   రూ.185.95ను పరీక్షించొచ్చు. ఒకవేళ రూ.190.75 కంటే పైకి వెళితే రూ.191.75 వరకు రాణించొచ్చు. రూ.191 ఎగువన ట్రేడ్‌ కానంతవరకు, నష్టపోయేందుకే అవకాశం ఉంది.
  • జింక్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.224.35 కంటే కిందకు వస్తే మరింతగా పడిపోవచ్చు. ఒకవేళ రూ.238 కంటే పైన కదలాడితే రూ.254 వరకు వెళ్లొచ్చు.

అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో చలిస్తే రూ.221.45 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.216.45 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.230.40 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని మించితే రూ.234.40 వరకు పెరగొచ్చు.


ఇంధన రంగం

ముడి చమురు మే కాంట్రాక్టు రూ.7,057 కంటే దిగువన కదలాడకుంటే సానుకూల ధోరణికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.6,924; రూ.6,792 వరకు దిద్దుబాటు కావచ్చు.
సహజవాయువు మే కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో చలించే అవకాశం ఉంది. రూ.170 కంటే పైన కదలాడకుంటే మరింతగా పడిపోవచ్చు. అయితే రూ.161.60 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.156.50కు దిగిరావచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు జూన్‌ కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలిస్తే రూ.18,996 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.19,992 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.17,294 కంటే దిగువన దలాడితే రూ.16,592కు పడిపోవచ్చు.
  • పత్తి క్యాండీ మే కాంట్రాక్టు రూ.56,686 కంటే కిందకు వస్తే రూ.55,413కు దిగిరావచ్చు. అదేవిధంగా రూ.59,686 కంటే ఎగువన కదలాడితే రూ.61,413 వరకు రాణించొచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని