జొమాటో ప్లాట్‌ఫాం ఫీజు రూ.5కు పెంపు

ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది.

Published : 23 Apr 2024 01:36 IST

హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో

దిల్లీ: ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. ఇతర నగరాల నుంచి కూడా ఆహారాన్ని డెలివరీ చేసే ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్‌’ సేవను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కంపెనీ యాప్‌ వెల్లడిస్తోంది. మార్చి 15 నుంచి ఇప్పటి దాకా రూ.227.85 కోట్ల పన్ను కట్టాలంటూ ఈ ఆహార డెలివరీ ప్లాట్‌ఫాంకు నోటీసులు అందాయి. కంపెనీ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండగా, ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. పెంచిన ప్లాట్‌ఫాం ఫీజు హైదరాబాద్‌ సహా దిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, ముంబయి తదితర నగరాల్లో అమలు చేయొచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టులో ఈ సంస్థ ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.2తో మొదలుపెట్టింది. క్రమంగా పెంచుకుంటూ వెళుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని