దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం

దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది.

Updated : 23 Apr 2024 01:42 IST

దిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. మొత్తం 6,128 విమాన సర్వీసులు వీరిని చేరవేశాయని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి. కొవిడ్‌కు ముందు రోజువారీ విమాన ప్రయాణికుల సగటు 3,98,579 తో పోలిస్తే ఇది 14% ఎక్కువ. ఇంతకుముందు 2023 ఏప్రిల్‌ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించారు. భారత దేశీయ విమానయాన రంగం రోజూ కొత్త గరిష్ఠాలకు చేరుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని