ఇంటిపై సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్‌ బ్యాంక్‌తో టాటా పవర్‌ భాగస్వామ్యం

నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Published : 24 Apr 2024 02:37 IST

దిల్లీ: నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఇళ్లపై 3 కిలోవాట్‌ (కేడబ్ల్యూ) సౌరశక్తి విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతోపాటు 3 నుంచి 10 కేడబ్ల్యూ వరకూ సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటుకూ తమ భాగస్వామ్యం మద్దతు ఇస్తుందని టాటా పవర్‌, ఇండియన్‌ బ్యాంక్‌ వెల్లడించాయి. పీఎం సూర్య ఘర్‌ యోజన కింద రూ.2 లక్షల వరకు రుణానికి 7% వార్షిక వడ్డీ అవుతుంది. 10% మార్జిన్‌ మనీని గృహ యజమానులు భరించాలి. హామీ అవసరం లేకుండా ఈ రుణం లభిస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి పదేళ్ల వరకు ఉంటుంది. 3-10 కిలోవాట్‌ సామర్థ్యం వరకు ఇండియన్‌ బ్యాంక్‌ రుణాలు ఇస్తుంది. అర్హత ఉన్న వినియోగదారులు రూ.6 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీనికోసం 20% మార్జిన్‌ మనీ అవసరం అవుతుంది. వడ్డీ రేట్లు 8.4% నుంచి 10.8% వరకు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని