ఇండిగోలో ఇన్‌ఫ్లైట్‌ వినోదం

మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్‌ ద్వారా ఇన్‌-ఫ్లైట్‌ వినోద కంటెంట్‌ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది.

Published : 24 Apr 2024 02:41 IST

దిల్లీ: మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్‌ ద్వారా ఇన్‌-ఫ్లైట్‌ వినోద కంటెంట్‌ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. మూడు నెలల పాటు ప్రయోగాత్మక పద్ధతిలో దీనిని అందించనున్నారు. దేశీయ విమానాల్లో వినోద కంటెంట్‌ను అందించడం ఇదే తొలిసారి అవుతుంది. విమానంలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అంతరాయం కలగకుండా ఉండడం కోసం, విమానం నిర్దిష్ట ఎత్తుకు చేరాక ఈ సేవలను అందజేస్తారు. ఈ సేవలను ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ వ్యక్తిగత హెడ్‌ఫోన్స్‌ వాడాలి. నమూనా దశ విజయవంతమయ్యాక పూర్తి స్థాయిలో ఈ సేవలను తీసుకొస్తామని ఇండిగో పేర్కొంది. ఇండిగోకు 350కు పైగా విమానాలుండగా.. రోజుకు 2,000 వరకు రోజువారీ విమాన సర్వీసులను నడుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని