కాస్త దిగొచ్చిన బంగారం

ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం.

Published : 24 Apr 2024 02:41 IST

ఈనాడు వాణిజ్య విభాగం: ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.74,300, కిలో వెండి రూ.83,300 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో బంగారం ధర రూ.73,500కు దిగి వచ్చినా మళ్లీ కొంత పెరిగింది. గతవారంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.76,750 వద్ద గరిష్ఠ స్థాయికి చేరగా, కిలో వెండి      రూ.85,000కు చేరిన సంగతి విదితమే. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 2,400 డాలర్లను మించగా తాజాగా 2325 డాలర్ల వద్ద కదలాడుతోంది. చైనా కేంద్రబ్యాంక్‌ కొనుగోళ్ల వల్లే ఇంకా అంతర్జాతీయ విపణిలో పసిడి ధర అధికంగా ఉందని, లేకపోతే ఇంకా తగ్గేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సమీప కాలంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.72,000 స్థాయికి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని