మోదీ అనితర సాధ్యుడు

భారత్‌లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్‌చేజ్‌ సీఈఓ జేమీ డైమన్‌ ప్రశంసించారు.

Published : 25 Apr 2024 01:58 IST

40 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు
జేపీ మోర్గాన్‌ సీఈఓ జేమీ డైమన్‌ ప్రశంసలు

న్యూయార్క్‌: భారత్‌లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్‌చేజ్‌ సీఈఓ జేమీ డైమన్‌ ప్రశంసించారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రధానిగా మోదీ, దేశంలో నమ్మకశ్యం కాని విద్యా వ్యవస్థ, మౌలిక వసతులను కల్పించారు. దేశం మొత్తాన్ని ప్రగతి పథాన నడిపారు. దేశంలో ప్రతి పౌరుణ్ని వేలి ముద్ర, కనుపాప ద్వారా గుర్తించే డిజిటల్‌ వ్యవస్థ ఏర్పడింది. 70 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచారు. వారికి చెల్లింపులన్నీ ఆ ఖాతాల ద్వారా చేస్తున్నారు. దేశంలో కొన్ని పాత అధికార వ్యవస్థలను పక్కనపెట్టి మరీ మోదీ ముందుకు వెళ్లారు. ఇక్కడ (అమెరికాలో) కూడా ఆ తరహా సంస్కరణలు అవసరం. పరోక్ష పన్ను వ్యవస్థ (జీఎస్‌టీ) ద్వారా భారత్‌లో అవినీతిని తగ్గించగలిగారు. ఇలా పలు అంశాల్లో ప్రపంచానికి మోదీ ఆదర్శంగా నిలిచార’ని పేర్కొన్నారు. అమెరికాలోనే అతిపెద్ద బ్యాంకు అయిన మోర్గాన్‌చేజ్‌కు జేమీ 18 ఏళ్లుగా సారథ్యం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని