సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్‌ జట్టు

కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్‌ ఉన్నతితో బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Published : 25 Apr 2024 01:58 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్‌ ఉన్నతితో బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లో సన్నకారు రైతులకు వ్యవసాయానికి అవసరమైన వాటిని అందజేసేందుకు జట్టు కట్టినట్లు తెలిపింది. ఈ అవగాహన ఒప్పందం కింద.. సరైన సమయంలో పంట సలహాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతులను నేర్పించడం, బేయర్‌ ప్రీమియం ఉత్పత్తులను సీఎస్‌సీ పోర్టల్‌ ద్వారా అందించడం చేస్తారు. గ్రామ్‌ ఉన్నతి ద్వారా రైతులు మార్కెట్‌కు అనుసంధానం అయ్యేలా చేస్తారు. తొలిదశలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల రైతులకు సహకారం అందిస్తామని బేయర్‌ తెలిపింది. ‘ప్రభుత్వానికి చెందిన సీఎస్‌సీ, గ్రామ్‌ ఉన్నతితో మా భాగస్వామ్యం ద్వారా రైతుల సాధికారికతను సాధించాలన్న ఉమ్మడి లక్ష్యానికి చేరువ కాగలమని.. మారుమూల ప్రాంత రైతుల జీవితాలను మెరుగుపరచగలమ’ని బేయర్‌ సౌత్‌ ఇండియా ప్రెసిడెంట్‌ థార్టన్‌ వీబుష్‌ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో 5 లక్షల మందికి పైగా రైతుల్లో సాధికారికత తీసుకురావాలన్నదే తమ ఉమ్మడి ధ్యేయమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని