యాపిల్‌ నుంచి కొత్త ఐప్యాడ్‌లు మే 7న

యాపిల్‌ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్‌లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్‌ ప్రో, ఐప్యాడ్‌ ఎయిర్‌లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Published : 25 Apr 2024 01:59 IST

దిల్లీ: యాపిల్‌ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్‌లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్‌ ప్రో, ఐప్యాడ్‌ ఎయిర్‌లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఐప్యాడ్‌ల విక్రయాలు తగ్గుతున్న సమయంలో, కొత్త ఐప్యాడ్‌లను యాపిల్‌ విడుదల చేయనుండటం గమనార్హం. డిసెంబరు 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఐప్యాడ్‌ల విక్రయాలు 25% తగ్గి 7.02 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.58,000 కోట్ల)కు పరిమితమయ్యాయి. ఐఫోన్ల విక్రయాలు కూడా నెమ్మదించాయి. కొత్త ఐప్యాడ్‌ల విడుదలతో గిరాకీ పెంచుకోవాలని యాపిల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రో, ఎయిర్‌, మినీ, 9, 10వ తరం రెగ్యులర్‌ ఐప్యాడ్‌ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర విక్రయాల్లో (119.58 బి.డాలర్లు) ఐప్యాడ్‌ల వాటా 5.9 శాతమే. జూన్‌ 10-14 మధ్య ప్రపంచవ్యాప్త డెవలపర్ల సమావేశాన్ని కూడా యాపిల్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని