స్వల్పంగా తగ్గిన ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభం

భారతీయ ఐటీ కంపెనీ ఎల్‌టీఐమైండ్‌ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 25 Apr 2024 01:59 IST

దిల్లీ: భారతీయ ఐటీ కంపెనీ ఎల్‌టీఐమైండ్‌ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,114.1 కోట్లతో పోలిస్తే ఇప్పుడు స్వల్పంగా (1.2%) తగ్గింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.8,691 కోట్ల నుంచి 2.32% పెరిగి రూ.8,892.9 కోట్లకు చేరింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 4% పెరిగి రూ.4,584.6 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయమూ 7.03% పెరిగి రూ.35,517 కోట్లకు చేరింది.

  • ‘గత ఆర్థిక సంవత్సరంలో సవాళ్తున్నా, మంచి పని తీరు కనబరిచాం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలర్‌ రూపేణా 4.4% ఆదాయ వృద్ధి సాధించాం. ఎబిటా మార్జిన్‌ 15.7 శాతంగా నమోదైంద’ని ఎల్‌టీఐమైండ్‌ట్రీ సీఈఓ, ఎండీ దేబాషిస్‌ ఛటర్జీ వెల్లడించారు.
  • గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి 5.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.46,500 కోట్ల) విలువైన ఆర్డర్లు లభించాయని, 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 15.7% అధికమని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని