నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు

పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

Published : 25 Apr 2024 02:02 IST

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

హైదరాబాద్‌ (పటాన్‌చెరు), న్యూస్‌టుడే: పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఆయన రచించిన ‘జస్ట్‌ ఏ మెర్సెనరీ? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’లో బుధవారం జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన దువ్వూరి, తన తల్లి గురించి రాసిన అంశాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ మారుతున్న వ్యవస్థలో ఐఏఎస్‌ మహిళా అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. పాలకులకు అధికారులిచ్చే నివేదికలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని.. ఇందుకోసం క్షేత్రస్థాయి వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. వాస్తవ పరిస్థితులను నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ సుబ్బారావు, కౌటిల్య ప్రోగ్రాం మేనేజర్‌ శివాంగిశర్మ, డీన్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌, కార్యక్రమ సమన్వయకర్త స్మితాశర్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని