కేశోరామ్‌ ఛైర్‌పర్సన్‌ మంజుశ్రీ ఖైతాన్‌ మృతి

కేశోరామ్‌ ఛైర్‌పర్సన్‌ మంజుశ్రీ ఖైతాన్‌(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్‌ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్‌కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్‌ అధికారులు తెలిపారు.

Published : 17 May 2024 02:49 IST

కోల్‌కతా: కేశోరామ్‌ ఛైర్‌పర్సన్‌ మంజుశ్రీ ఖైతాన్‌(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్‌ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్‌కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్‌ అధికారులు తెలిపారు. 1998 అక్టోబరులో కేశోరాం బోర్డులో మంజుశ్రీ చేరారు. 2019 జులైలో తండ్రి బసంత్‌ కుమార్‌ బిర్లా కన్నుమూతతో ఆమె ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.అశోక్‌ హాల్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం ఆమెకు బాలికా విద్యపై ఉన్న ప్రేమను చాటుతోందని గ్రూప్‌ అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని