రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్‌ ఐడియా నష్టం

వొడాఫోన్‌ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23  ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

Published : 17 May 2024 02:50 IST

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23  ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. వడ్డీ, ఆర్థిక వ్యయాలు పెరగడం వల్లే, నష్టాలు మరింత అధికమయ్యాయని కంపెనీ తెలిపింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం స్తబ్దుగా రూ.10,607 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ రూ.31,238.4 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. 2022-23లో ఇది రూ.29,301.1 కోట్లుగా ఉంది.

వార్షిక కార్యకలాపాల ఆదాయం రూ.42,177.2 కోట్ల నుంచి 1.1% పెరిగి రూ.42,651.7 కోట్లకు చేరింది. ‘వరుసగా 11 త్రైమాసికాల పాటు వినియోగదారు సగటు ఆదాయం (ఆర్పు), 4జీ చందాదారుల్లో వృద్ధి నమోదైంది. ఏడాది క్రితంతో పోలిస్తే, మార్చి ఆఖరుకు ఆర్పు 7.6% పెరిగి రూ.146గా నమోదైంది. రూ.21,500 కోట్ల ఈక్విటీ నిధుల సమీకరణతో 4జీ కవరేజీ పెంచడంతో పాటు 5జీ సేవలను ప్రారంభించనున్నాం. విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధుల కోసం రుణదాతలతో చర్చిస్తున్నాం’ అని వొడాఫోన్‌ ఐడియా సీఈఓ అక్షయ మూంద్రా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని