చైనా స్థిరాస్తి రంగానికి ఊరట

దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది.

Published : 20 May 2024 01:25 IST

రూ.3.5 లక్షల కోట్ల ఉద్దీపన

బీజింగ్‌: దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. తద్వారా దివాలా తీసిన స్థిరాస్తి రంగాన్ని పునరుజ్జీవింపజేస్తోంది. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, ప్రభుత్వ-సబ్జిడైజ్డ్‌ (రాయితీతో కూడిన) హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం 300 బిలియన్‌ యువాన్‌ల (సుమారు 42.25 బిలియన్‌ డాలర్లు - రూ.3.5 లక్షల కోట్ల) రీలెండింగ్‌ (రుణ పునర్‌వ్యవస్థీకరణ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణం పూర్తయిన సహేతుక వాణిజ్య గృహాలను కొనుగోలు చేయడానికి, స్థానిక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు ఈ నిధులు ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా డిప్యూటీ గవర్నర్‌ టావో లింగ్‌  తెలిపారు. 

రూ.11.37 లక్షల కోట్ల రుణాలు

స్థిరాస్తి రంగానికి అందిస్తున్న మద్దతులో భాగంగా, దేశ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య బ్యాంకులు 2024 తొలి త్రైమాసికంలో మొత్తం 963.6 బిలియన్‌ యువాన్ల (సుమారు 137 బిలియన్‌ డాలర్లు - రూ.11.37 లక్షల కోట్లు) స్థిరాస్తి అభివృద్ధి రుణాలతో పాటు, వ్యక్తిగత గృహ రుణాల కోసం వందల కోట్ల యువాన్లు మంజూరు చేశాయని ప్రభుత్వ నిర్వహణలోని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని