సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కేంద్రం మార్గదర్శకాలు

మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్‌ ఆక్సైడ్‌ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది.

Published : 21 May 2024 01:42 IST

దిల్లీ: మనదేశం నుంచి ఎగుమతి అయ్యే సుగంధ ద్రవ్యాలు ఎథిలీన్‌ ఆక్సైడ్‌ (ఈటీఓ)తో కలుషితం కాకుండా ఉండేలా చూడడం కోసం కేంద్రం సవివర మార్గదర్శకాలను జారీ చేసింది. సింగపూర్, హాంకాంగ్‌ దేశాలకు వెళ్లే వాటికి పరీక్షలను తప్పనిసరి చేయడం వంటి ముందస్తు జాగ్రత్తలనూ కేంద్రం తీసుకొచ్చింది. ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్‌ బ్రాండ్లకు చెందిన కొన్ని మసాలా ఉత్పత్తుల్లో ఈటీఓ అవశేషాలు కనిపించాయని ఆరోపిస్తూ ఆయా దేశాలు ఆ ఉత్పత్తులను రీకాల్‌ చేయడం ఇందుకు నేపథ్యం. అన్ని దశల్లో (సోర్సింగ్, ప్యాకేజింగ్, రవాణా, టెస్టింగ్‌)ల్లో ఈటీఓ కలుషితం అవడానికి ఉండే అవకాశాలను నిలువరించేందుకు అందరు ఎగుమతిదార్లు ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. ‘స్పైసెస్‌ బోర్డు’ నిర్ణీత కాలావధుల్లో ఎగుమతిదార్ల నుంచి శాంపిళ్లను పరీక్షిస్తుందని.. తదనుగుణంగా దిద్దుబాటు చర్యలను చేపడతారని ఒక అధికారి వివరించారు. 

2023-24లో వేర్వేరు దేశాలకు ఎగుమతి చేసిన 1.4 మిలియన్‌ టన్నుల సుగంధ ద్రవ్యాలు ఆయా దేశాల నాణ్యతా ప్రమాణాలను చేరుకోగలిగాయని, కేవలం 0.2 శాతమే నిబంధనలకు లోబడి లేవని ఆ అధికారి తెలిపారు. మన దేశంలోకి దిగుమతయ్యే 0.73% ఆహార వస్తువులు మన నిబంధనలకు అనుగుణంగా లేవని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని