మార్చిలో 14.41 లక్షల మంది చేరిక: ఈపీఎఫ్‌ఓ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు.

Published : 21 May 2024 01:53 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో ఈ ఏడాది మార్చిలో నికరంగా 14.41 లక్షల మంది సభ్యులు చేరారు. తాజాగా విడుదల చేసిన ఉద్యోగ గణాంకాల ప్రకారం సుమారు 11.80 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓను వీడినా, తర్వాత వీరిలో అత్యధికులు మళ్లీ చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓలో కొత్తగా చేరిన 7.47 లక్షల మంది సభ్యుల్లో 18-25 ఏళ్లలోపు వారే 56.83%  మంది ఉన్నారు. వీరంతా తొలిసారిగా ఉద్యోగాలు సాధించిన వారే. కొత్త సభ్యుల్లో మహిళలు 2 లక్షల మంది. ఈపీఎఫ్‌ఓ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ చేరిన వారితో కలిపి మొత్తం 2.90 లక్షల మంది మహిళలు మార్చిలో సంస్థలో చేరారు.

 తయారీ, మార్కెటింగ్‌ సేవలు, కంప్యూటర్ల వినియోగం, రెస్టారెంట్లు, అకౌంటెంట్లు, చేపల ప్రాసెసింగ్, మాంసాహార నిల్వ, బీడీ తయారీ వంటి రంగాల్లో ఎక్కువ మంది చేరారు. కొత్త సభ్యుల్లో సుమారు 43% మంది నైపుణ్య సేవల్లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని