విస్తరణ దిశగా నెక్స్ట్‌వేవ్‌

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్‌ అంకురం నెక్ట్స్‌వేవ్‌ విస్తరణ బాట పట్టింది.

Updated : 21 May 2024 12:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే హైదరాబాదీ ఎడ్యుటెక్‌ అంకురం నెక్ట్స్‌వేవ్‌ విస్తరణ బాట పట్టింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలని కోరుకునే వారికోసం ప్రత్యేక ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌ నెక్స్ట్‌వేవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌ (ఎన్‌ఐఏటీ)ను ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ రాహుల్‌ అట్టులూరి సోమవారం వెల్లడించారు. మెషీన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ వంటి ఆధునిక సాంకేతికతలు ఈ కోర్సులో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది తొలి క్యాంపస్‌ ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాదికి వీటి సంఖ్య 10కి చేరుతుందన్నారు. ఇందులో హైదరాబాద్‌లో 4, చెన్నై, పుణె, ముంబయి, కోచిల్లో కూడా క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తామని వివరించారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన నెక్స్ట్‌వేవ్‌ ఇప్పటికి దాదాపు రూ.296 కోట్ల వరకు నిధులను సమకూర్చుకుంది. వీటి నుంచే క్యాంపస్‌ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనున్నట్లు రాహుల్‌ తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 1,400 మంది ఉద్యోగులున్నారని, రెండేళ్లలో వీరి సంఖ్య 3,000కు చేరుతుందని తెలిపారు. ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు, విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల మధ్య అంతరం ఉంటోందని, ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలో నిపుణులైన వారితో శిక్షణ అందిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని