ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీకి దేశంలో ప్రథమ స్థానం

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కస్టమ్‌ ర్యాంకింగ్‌- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

Published : 21 May 2024 01:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కస్టమ్‌ ర్యాంకింగ్‌- 2024 లో మనదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో 2వ స్థానం సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 26వ ర్యాంకు సాధించింది. గత ఏడాది అంతర్జాతీయంగా 29వ ర్యాంకులో ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు ఇంకా మెరుగైన ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రపంచ స్థాయి వినూత్న బోధన, పరిశోధనా కార్యకలాపాలతోనే తాము అంతర్జాతీయంగా గుర్తింపు సాధిస్తున్నట్లు ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ దీపా మణి వివరించారు. ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామనే విషయం స్పష్టమవుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని