దిల్లీలో ఉబర్‌ బస్సు సేవలు

‘దిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్‌ లైసెన్స్‌ పొందినట్లు ఉబర్‌ వెల్లడించింది.

Published : 21 May 2024 01:55 IST

దిల్లీ: ‘దిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌’ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు దిల్లీ రవాణా విభాగం నుంచి అగ్రిగేటర్‌ లైసెన్స్‌ పొందినట్లు ఉబర్‌ వెల్లడించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన బస్సు సేవలు విజయవంతం కావడంతో అధికారికంగా బస్సుల్లో ఉబర్‌ రైడ్స్‌ ప్రారంభిస్తున్నామని ఉబర్‌ షటిల్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ దేశ్‌పాండే వెల్లడించారు. ఉబర్‌ షటిల్‌ లేదా ఉబర్‌ యాప్‌ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన మార్గాల్లో ముందస్తుగా సీట్లు ఎంపిక చేసుకోవచ్చని, వారం ముందుగా కూడా రిజర్వ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. షటిల్‌ వాహనంలో 19-50 మంది ప్రయాణికులను సర్దుబాటు చేసి, స్థానిక రవాణా భాగస్వాములతో ఉబర్‌ సాంకేతికతను వినియోగించి బస్సు సేవలు నిర్వహించనున్నారు. రోజువారీ ప్రయాణించే వారికి తమ సేవలు ఉపయోగ పడతాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని