ఆయిల్‌ ఇండియా 2 షేర్లకు ఒకటి బోనస్‌

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్‌ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Published : 21 May 2024 01:56 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్‌ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,979.74 కోట్లతో పోలిస్తే ఇది 18% ఎక్కువ. ముడిచమురు అధిక ధరలు ఇందుకు దోహదపడ్డాయి. మొత్తం టర్నోవర్‌ 16% వృద్ధితో రూ.10,375.09 కోట్లకు చేరింది. ముడిచమురు ఉత్పత్తి, విక్రయాల ఆదాయం 18% పెరగ్గా, గ్యాస్‌ ఉత్పత్తి, విక్రయాల నుంచి ఆదాయం 16.5% తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ నికర లాభం 2022-23తో పోలిస్తే 29% తగ్గి రూ.6,980.45 కోట్లుగా నమోదైంది. 

 ప్రతి రెండు షేర్లకు బోనస్‌గా ఒక షేరు (1:2 నిష్పత్తిలో) ఇవ్వడానికి ఆయిల్‌ ఇండియా బోర్డు ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3.75 తుది డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. బోనస్‌ అనంతరం అయితే ఇది రూ.2.50 కానుంది. 2023-24లో చెల్లించిన మధ్యంతర డివిడెండ్‌ రూ.3.50, రెండో మధ్యంతర డివిడెండ్‌ రూ.8.50 (బోనస్‌కు ముందు)కు ఇది అదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని