ఆస్‌బెస్టాస్‌ సిమెంట్‌ ఉత్పత్తులకు తప్పనిసరి నాణ్యతా నిబంధనలు

Published : 22 May 2024 01:53 IST

దిల్లీ: ఆస్‌బెస్టాస్‌ లేదా ఫైబర్‌ సిమెంట్‌ ఆధారిత ఉత్పత్తులు పాటించాల్సిన తప్పనిసరి నాణ్యతా నిబంధనలను ప్రభుత్వం జారీ చేసింది. తక్కువ స్థాయి (సబ్‌ స్టాండర్డ్‌) నాణ్యత కలిగిన ఉత్పత్తుల దిగుమతుల్ని అరికట్టడంతో పాటు దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగానే వీటిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ‘ఆస్‌బెస్టాస్‌ / ఫైబర్‌ సిమెంట్‌ ఆధారిత ఉత్పత్తులు (నాణ్యతా నియంత్రణ) ఆర్డర్‌ 2024’ పేరుతో పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, భారత ప్రమాణాల మండలి (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ - బీఐఎస్‌) నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం, విక్రయించడం, ట్రేడ్‌ చేయడం, దిగుమతి చేయడం వంటివి చేయరాదు. అధికారిక జీవో ప్రచురితమైన 6 నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని డీపీఐఐటీ పేర్కొంది. గతంలో స్మార్ట్‌ మీటర్లు, వెల్డింగ్‌ రాడ్లు, ఎలక్ట్రోడ్లు, వంట సామాన్లు, పాత్రలు, అగ్నిమాపక యంత్రాలు, విద్యుత్‌ సీలింగ్‌ ఫ్యాన్లు, దేశీయ గ్యాస్‌ స్టౌలు వంటి వాటికి కూడా ప్రభుత్వం నాణ్యతా నిబంధనలను తప్పనిసరి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని