ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీపై నేడు నిర్ణయం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్లు బుధవారం సమావేశమై, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీపై చేసే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Published : 22 May 2024 01:55 IST

ఖజానాకు రూ.75,000-1,20,000 కోట్లు!

దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్లు బుధవారం సమావేశమై, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీపై చేసే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.75,000-1,20,000 కోట్ల మేర మిగులు నిధులను బదిలీ చేయొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రూ.87,416 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.1.02 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2023-24లో సవరించిన అంచనా రూ.1.04 లక్షల కోట్ల కంటే ఇది తక్కువే. ఈ సమావేశంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు వార్షిక నివేదికతో పాటు 2023-24 ఖాతాలను ఆమోదించే అవకాశం కూడా ఉంది. కంటిన్‌జెన్సీ రిస్క్‌ బఫర్‌ లెవల్‌ను కూడా నిర్ణయించొచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఖాతాల ప్రకారం ఇది 6 శాతంగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని