నూనె పరిమాణాన్ని చూసి కొనండి: ఫ్రీడమ్‌ ఆయిల్స్‌

వంటనూనెల సంస్థ ఫ్రీడమ్‌ హెల్దీ కుకింగ్‌ ఆయిల్స్‌ సరికొత్త ప్రచారం ‘ఆర్‌ యూ బైయింగ్‌ రైట్‌?’ (మీరు సరైనది కొనుగోలు చేస్తున్నారా?)ను ప్రారంభించింది. ‘ఒక లీటర్‌ నూనె ప్యాకెట్‌లో 910 గ్రాముల నూనె ఉండాలి.

Updated : 22 May 2024 06:09 IST

హైదరాబాద్‌: వంటనూనెల సంస్థ ఫ్రీడమ్‌ హెల్దీ కుకింగ్‌ ఆయిల్స్‌ సరికొత్త ప్రచారం ‘ఆర్‌ యూ బైయింగ్‌ రైట్‌?’ (మీరు సరైనది కొనుగోలు చేస్తున్నారా?)ను ప్రారంభించింది. ‘ఒక లీటర్‌ నూనె ప్యాకెట్‌లో 910 గ్రాముల నూనె ఉండాలి. అయితే కొన్ని బ్రాండ్‌లు 850-870 గ్రాముల నూనెతోనే లీటర్‌ ప్యాకెట్‌ను విక్రయిస్తున్నాయి. అందువల్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కొనే వారు తప్పనిసరిగా, దానిపై ముద్రించే పరిమాణాన్ని తనిఖీ చేయాల’ని ఫ్రీడమ్‌ ఆయిల్స్‌ కోరుతోంది.  వినియోగదారుల వ్యవహారాల శాఖ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది. ఫ్రీడమ్‌ రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్రతి 1 లీటర్‌ పౌచ్‌లో 910 గ్రాముల శుద్ధి చేసిన నూనె ఉంటోందని భరోసా ఇస్తున్నట్లు తయారీ సంస్థ జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (అమ్మకాలు, మార్కెటింగ్‌) పి.చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని