హైదరాబాద్‌లో ఎంఫసిస్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

క్లౌడ్, కాగ్నిటివ్‌ సేవల సంస్థ ఎంఫసిస్, హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను ప్రారంభించింది. హైటెక్‌ సిటీ  సమీపంలోని ఫీనిక్స్‌ ఇన్ఫోసిటీలో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు ఎంఫసిస్‌ వెల్లడించింది.

Published : 22 May 2024 01:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్లౌడ్, కాగ్నిటివ్‌ సేవల సంస్థ ఎంఫసిస్, హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను ప్రారంభించింది. హైటెక్‌ సిటీ  సమీపంలోని ఫీనిక్స్‌ ఇన్ఫోసిటీలో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు ఎంఫసిస్‌ వెల్లడించింది. ఈ కేంద్రంలో ప్రధానంగా ఏఐ (కృత్రిమ మేధ), జనరేటివ్‌ ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో తమ క్లయింట్లకు ఐటీ సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక, బీమా, స్థిరాస్తి రంగాల సంస్థలకు అనువైన సేవలు ఆవిష్కరిస్తామని  ఎంఫసిస్‌ గ్లోబల్‌ డెలివరీ హెడ్‌ రవి వసంత్‌రాజ్‌ తెలిపారు. ఎంఫసిస్‌- ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్‌ ఫర్‌ క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటింగ్‌ మధ్య భాగస్వామ్య ఒప్పందం ఉంది. సరకు రవాణా, ఆరోగ్య సేవల విభాగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు తగిన పరిష్కార మార్గాలను క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తో అన్వేషించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ ఫ్యాకల్టీ హెడ్‌ అనిల్‌ ప్రభాకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని