మళ్లీ 200 బిలియన్‌ డాలర్లకు అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ

అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ మళ్లీ 200 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16.9 లక్షల కోట్ల) స్థాయికి చేరింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ మరో రూ.11,300 కోట్లు పెరగడంతో ఈ ఘనత సాధించింది.

Published : 23 May 2024 01:44 IST

ముంబయి: అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ మళ్లీ 200 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16.9 లక్షల కోట్ల) స్థాయికి చేరింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ మరో రూ.11,300 కోట్లు పెరగడంతో ఈ ఘనత సాధించింది. గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో కలిపి గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.56,250 కోట్ల మేర పెరిగింది. తమిళనాడు విద్యుత్‌ సంస్థకు 2013లో సరఫరా చేసిన బొగ్గు నాణ్యతలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చడంతో మదుపర్లు ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో మార్కెట్‌ విలువ  పెరిగింది.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని