కంపెనీల చట్టం ఉల్లంఘనల కేసులో లింక్డ్‌ఇన్, సత్య నాదెళ్ల సహా 10 మందికి జరిమానా

కంపెనీల చట్ట నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్‌ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ సత్యనాదెళ్లతో పాటు మరో ఎనిమిది మందిపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ బుధవారం అపరాధ రుసుము విధించింది.

Published : 23 May 2024 01:54 IST

దిల్లీ: కంపెనీల చట్ట నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్‌ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ సత్యనాదెళ్లతో పాటు మరో ఎనిమిది మందిపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ బుధవారం అపరాధ రుసుము విధించింది. కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్‌ (ఎస్‌బీఓ) నిబంధనలను లింక్డ్‌ఇన్‌తో పాటు ఇతరులు ఉల్లంఘించార’ని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఎన్‌సీటీ ఆఫ్‌ దిల్లీ, హరియాణా) తన 63 పేజీల ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘సత్య నాదెళ్ల, లింక్డ్‌ఇన్‌ కార్పొరేషన్‌ గ్లోబల్‌ సీఈఓ రియాన్‌ రోస్లాన్‌స్కై ఆ కంపెనీకి ఎస్‌బీఓలు. సెక్షన్‌ 90(1) కింద కొన్ని అంశాలను నివేదించడంలో విఫలం కావడంతో కంపెనీతో పాటు అధికారులు రూ.27,10,800 అపరాధ రుసుము కట్టాలి’ అని తన ఆదేశాల్లో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌(ఆర్‌ఓసీ) వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌ ఇండియాపై రూ.7 లక్షలు, నాదెళ్ల, రియాన్‌లపై రూ.2 లక్షల చొప్పున ఫైన్‌ వేశారు. కంపెనీ అధికారులు కీత్‌ రేంజర్‌ డాలివర్, బెంజిమన్‌ ఓవెన్‌ ఓర్నాడార్ఫ్, మిషెల్‌ కాటీ, లీసా ఎమికో సాటో, ఆశుతోష్‌ గుప్తా, మార్క్‌ లియోనార్డ్‌ నాడ్రెస్‌ లెగాస్పి, హెన్నీ చినింగ్‌ ఫాంగ్‌ కూడా అపరాధ రుసుము కట్టాల్సిన వారిలో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు