హోటల్‌ పరిశ్రమ ఆదాయ వృద్ధి 11%

ఈ ఏడాది జనవరి-మార్చిలో భారతీయ హోటల్‌ పరిశ్రమకు బలమైన గిరాకీ కనిపించింది.  అందుబాటులో ఉన్న గదుల ద్వారా 11% ఆదాయ వృద్ధి నమోదైందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడించింది.

Published : 23 May 2024 01:55 IST

2024 జనవరి-మార్చిపై జేఎల్‌ఎల్‌ నివేదిక 

దిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చిలో భారతీయ హోటల్‌ పరిశ్రమకు బలమైన గిరాకీ కనిపించింది.  అందుబాటులో ఉన్న గదుల ద్వారా 11% ఆదాయ వృద్ధి నమోదైందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడించింది. వ్యాపార, విశ్రాంతి (లీజర్‌)కి అధిక గిరాకీ ఉండే ప్రాంతాల్లో హోటల్‌ గదులకు బలమైన గిరాకీ నమోదైందని తెలిపింది. ఆతిథ్య రంగంలో సగటు రోజువారీ రేటు (ఏడీఆర్‌) వార్షిక ప్రాతిపదికన 8.5 శాతంగా నమోదు కాగా, అందుబాటులో ఉన్న గదుల ఆదాయ వృద్ధి (రెవ్‌పార్‌) 11.4 శాతంగా నమోదైందని పేర్కొంది.

జనవరి-మార్చిలో చెన్నై రెవ్‌పార్‌లో బలమైన వృద్ధి (21.7%) నమోదు చేసింది. కార్పొరేట్ల ప్రయాణాలు, పెళ్లిళ్లు, సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు (ఎంఐసీఈ) వంటి వాటికి గిరాకీ పెరగడంతో వృద్ధి పెరిగింది. ఆక్యుపెన్సీ స్థాయి సుమారు 70 శాతంగా నమోదైంది. 9,710 గదులు కలిగిన 90 బ్రాండెడ్‌ హోటళ్లు అందుబాటులోకి వచ్చాయి. జైపూర్, ఇందౌర్, సూరత్, అయోధ్య వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 2,316 గదులు కలిగిన 36 హోటళ్లు అందుబాటులోకి వచ్చాయని జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని