2030కి 100 ‘గేట్‌వే’ బ్రాండ్‌ హోటళ్లు

భారతీయ ప్రయాణ, పర్యాటక రంగం మంచి స్థితిలో ఉందని.. వృద్ధి బాటలో సాగుతున్న ఈ రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) ఎండీ, సీఈఓ పునీత్‌ ఛత్వాల్‌ వెల్లడించారు.

Published : 24 May 2024 02:59 IST

ఐహెచ్‌సీఎల్‌ ఎండీ పునీత్‌ ఛత్వాల్‌

దిల్లీ: భారతీయ ప్రయాణ, పర్యాటక రంగం మంచి స్థితిలో ఉందని.. వృద్ధి బాటలో సాగుతున్న ఈ రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) ఎండీ, సీఈఓ పునీత్‌ ఛత్వాల్‌ వెల్లడించారు. గిరాకీ-సరఫరా మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు, ద్వితీయ-తృతీయ శ్రేణి విపణుల్లో పెరుగుతున్న అవకాశాలు అందుకునేందుకు, విదేశీ పర్యాటకులకు తగిన సదుపాయాలు కల్పించేందుకు పెట్టుబడులు కావాలని వివరించారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు దేశంలోని క్షేత్రాలను విరివిగా సందర్శిస్తున్నారని 2023-24 కంపెనీ వార్షిక  వాటాదార్ల సమావేశంలో ఆయన తెలిపారు. ‘అద్భుతంగా ఎదుగుతున్న పరిశ్రమ అందించే అవకాశాలను ఉపయోగించుకునేందుకు టాటా గ్రూప్‌ ఆతిథ్య సంస్థ ఐహెచ్‌సీఎల్‌ సిద్ధంగా ఉంది. 2030 నాటికి ‘గేట్వే’ బ్రాండ్‌ (ఫుల్‌ సర్వీస్‌ హోటల్‌) కింద మెట్రోలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 100 హోటళ్ల పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తామ’ని తెలిపారు. తొలుత 15 హోటళ్లతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించి తర్వాత 100 హోటళ్లకు చేరుస్తామన్నారు. బేకల్, నాసిక్‌లలో ఈ హోటళ్లు ప్రారంభించిన తర్వాత బెంగళూరు, థానే, జైపూర్‌లలోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని