కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ నుంచి కొత్తగా 10 పంట సంరక్షణ ఉత్పత్తులు

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కొత్తగా 10 పంట సంరక్షణ ఉత్పత్తులు విడుదల చేసింది. ఇందులో పేటెంట్‌ కలిగిన ఉత్పత్తులు 3,  వేప పూతతో కూడిన బయో ప్లాంట్, నేల ఆరోగ్యాన్ని పెంపొందించే ఉత్పత్తి, 5 జనరిక్‌ ఫార్ములేషన్లు (వీటిలో 3 హెర్బిసైడ్లు) ఉన్నాయి.

Published : 25 May 2024 02:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కొత్తగా 10 పంట సంరక్షణ ఉత్పత్తులు విడుదల చేసింది. ఇందులో పేటెంట్‌ కలిగిన ఉత్పత్తులు 3,  వేప పూతతో కూడిన బయో ప్లాంట్, నేల ఆరోగ్యాన్ని పెంపొందించే ఉత్పత్తి, 5 జనరిక్‌ ఫార్ములేషన్లు (వీటిలో 3 హెర్బిసైడ్లు) ఉన్నాయి. కాండం తొలిచే పురుగు, ఆకు ముడత.. తదితర తెగుళ్ల నుంచి వరి పంటను రక్షించడానికి జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రచండ్‌’ అనే ఉత్పత్తి ఇందులో ఉంది. ఇది పంట నష్టాన్ని 70% వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. మొక్కజొన్న పంటను నాశనం చేసే కత్తెర పురుగును ఎదుర్కోడానికి ప్రత్యేక ఫార్ములాతో సస్య రక్షణ ఉత్పత్తిని తీసుకువచ్చినట్లు కంపెనీ వివరించింది. 2023-24లో సంస్థ ఆదాయాల్లో కొత్త ఉత్పత్తుల వాటా 15% కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయాల్లో కొత్త ఉత్పత్తుల వాటా ఇంకా పెరుగుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (బయో ఉత్పత్తులు, రిటైల్‌) డాక్టర్‌ రఘురామ్‌ దేవరకొండ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని