సాధారణ బీమా ప్రీమియం రూ.3.7 లక్షల కోట్లకు: ఇక్రా

సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 2025-26 నాటికి 32% వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు చేరొచ్చని ఇక్రా అంచనా వేసింది.

Published : 28 May 2024 02:25 IST

దిల్లీ: సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 2025-26 నాటికి 32% వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు చేరొచ్చని ఇక్రా అంచనా వేసింది. 2023-24లో ఇది రూ.2.8 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ప్రీమియం వసూళ్లలో ప్రైవేటు బీమా సంస్థలు బలంగా వృద్ధి నమోదు చేయనుండగా, ప్రభుత్వరంగ బీమా సంస్థల వృద్ధి మధ్యస్థంగా నమోదు కావొచ్చని పేర్కొంది. వాటి మూలధన స్థితి బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రైవేటు బీమా సంస్థల లాభదాయకత కూడా మెరుగవుతుందని వెల్లడించింది. పీఎస్‌యూ బీమా సంస్థల నికర లాభదాయకత తగ్గొచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని