ఎస్‌ఎమ్‌ఎస్‌ మోసాలపై ప్రభుత్వం కఠిన చర్యలు

ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత మూడు నెలల్లో 10,000కు పైగా మోసపూరిత సందేశాలను పంపడానికి వినియోగించిన ఎస్‌ఎమ్‌ఎస్‌ హెడ్డర్‌ల వెనుక ఉన్న అసలు సంస్థలను నిషేధిత జాబితా పెట్టింది.

Published : 28 May 2024 02:26 IST

దిల్లీ: ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత మూడు నెలల్లో 10,000కు పైగా మోసపూరిత సందేశాలను పంపడానికి వినియోగించిన ఎస్‌ఎమ్‌ఎస్‌ హెడ్డర్‌ల వెనుక ఉన్న అసలు సంస్థలను నిషేధిత జాబితా పెట్టింది. సంచార్‌ సాథీ కార్యక్రమం ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్‌ మోసాల నుంచి పౌరులను రక్షించేందుకు కేంద్ర హోం శాఖతో కలిసి టెలికాం విభాగం (డాట్‌) ఈ చర్యలు చేపట్టింది. సైబర్‌ మోసాలు చేసేందుకు వినియోగిస్తున్న 8 ఎస్‌ఎమ్‌ఎస్‌ హెడ్డర్‌లకు సంబంధించిన సమాచారాన్ని హోం శాఖ కింద పనిచేసే ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ అందించింది. గత మూడు నెలల్లో ఈ 8 హెడ్డర్‌ల నుంచి 10,000కు పైగా మోసపూరిత సందేశాలు వెళ్లాయి. వీటి యాజమానులైన అసలు సంస్థలను నిషేధిత జాబితాలో పెట్టారు. వీటికి చెందిన 73 ఎస్‌ఎమ్‌ఎస్‌ హెడ్డర్‌లు, 1,522 ఎస్‌ఎమ్‌ఎస్‌ కంటెంట్‌ టెంప్లేట్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. దీంతో ఇకపై ఇవి ఎస్‌ఎమ్‌ఎస్‌లు పంపించలేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని