అదనంగా 130 జీబీ డేటా: వొడాఫోన్‌ ఐడియా

వినియోగదారులను ఆకట్టుకునేందుకు వొడాఫోన్‌ ఐడియా (విఐ) కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది.

Published : 28 May 2024 02:26 IST

ముంబయి: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వొడాఫోన్‌ ఐడియా (విఐ) కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. విఐ నెట్‌వర్క్‌పై 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారికోసం ‘వి గ్యారంటీ ప్రోగ్రాం’ కింద ఏడాదికి 130 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్లు వెల్లడించింది. 28 రోజులకోసారి 10జీబీ నేరుగా వినియోగదారుల ఖాతాకు జమ అవుతుంది. ఇలా 13సార్లు డేటా జమ చేస్తామని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ప్లాన్‌ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాతో పాటు కొన్ని ఇతర టెలికాం సర్కిళ్లలో అందుబాటులో లేదని సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని