స్పైస్‌జెట్, అజయ్‌ సింగ్‌ నుంచి రూ.1,323 కోట్ల నష్ట పరిహారం కోరతాం

స్పైస్‌జెట్, దాని చీఫ్‌ అజయ్‌ సింగ్‌ నుంచి రూ.1,323 కోట్లకు పైగా నష్ట పరిహారం కోరతామని కేఏఎల్‌ ఎయిర్‌వేస్, కళానిధి మారన్‌ సోమవారం వెల్లడించారు.

Published : 28 May 2024 02:27 IST

కేఏఎల్‌ ఎయిర్‌వేస్, కళానిధి మారన్‌

దిల్లీ: స్పైస్‌జెట్, దాని చీఫ్‌ అజయ్‌ సింగ్‌ నుంచి రూ.1,323 కోట్లకు పైగా నష్ట పరిహారం కోరతామని కేఏఎల్‌ ఎయిర్‌వేస్, కళానిధి మారన్‌ సోమవారం వెల్లడించారు. ఈ వివాదంలో ఇటీవల దిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తామని తెలిపారు. స్పైస్‌జెట్, దాని ప్రమోటరు అజయ్‌ సింగ్‌ కలిపి మారన్‌కు వడ్డీతో పాటు రూ.579 కోట్లు తిరిగి చెల్లించాల్సిందిగా మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, సింగిల్‌ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను కోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈనెల 17న కొట్టివేసింది. 2023 జులై 31న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ సింగ్, స్పైస్‌జెట్‌ దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతించింది. మధ్యవర్తిత్వ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను పరిశీలించేందుకు సంబంధిత కోర్టుకు తిరిగి అప్పగించింది. ఈ నేపథ్యంలో మారన్, అతని సంస్థ కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌ తమ న్యాయవాదిని సంప్రదించిన తర్వాత, ఈ తీర్పును సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని