ఏవియేషన్‌ విద్యలోకి చెన్నైస్‌ అమిర్త గ్రూపు

దేశంలో విమానాశ్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఉపాధి అవకాశాలు అధికమవుతున్నాయని చెన్నైస్‌ అమిర్త గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌ భూమీనాథన్‌ పేర్కొన్నారు.

Published : 29 May 2024 03:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో విమానాశ్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఉపాధి అవకాశాలు అధికమవుతున్నాయని చెన్నైస్‌ అమిర్త గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌ భూమీనాథన్‌ పేర్కొన్నారు. ఒక్కో విమానాశ్రయంలో 3,000 మందికి పైగా సిబ్బంది అవసరమని, ఈ రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, విమానయాన రంగంలో అవసరమైన నైపుణ్యాలు నేర్పించేలా ఏవియేషన్‌ డిగ్రీని తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే చెన్నైలో దీన్ని ప్రారంభించగా, ఈ ఏడాది జులై నుంచి హైదరాబాద్‌లో మరో కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ఇక్కడ  వెల్లడించారు. ఇందుకోసం యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ మలేషియా (యూనికామ్‌), బిర్మింఘాం అకాడెమీ సింగపూర్‌లతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కోర్సులో భాగంగా విమానాశ్రయాల్లో పనిచేస్తూ సంపాదించేందుకూ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఏడాది డిప్లొమా, మూడేళ్ల డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆతిథ్య రంగంలో శిక్షణ కోసం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరుల్లోని కేంద్రాల్లో 25వేల మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు